Thu Jan 29 2026 04:22:24 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి హైపవర్ కమిటీ?
అమరావతి రాజధాని, మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే ఒకసారి సమావేశమైన హైపవర్ కమిటీ అభివద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన [more]
అమరావతి రాజధాని, మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే ఒకసారి సమావేశమైన హైపవర్ కమిటీ అభివద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన [more]

అమరావతి రాజధాని, మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే ఒకసారి సమావేశమైన హైపవర్ కమిటీ అభివద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాలని అభిప్రాయపడింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈరోజు సమావేశంలో రాజధాని రైతులకు చేయాల్సిన న్యాయం గురించి చర్చిస్తారు. రాజధాని రైతులకు ఎలాంటి ప్యాకేజీ ఇస్తే బాగుంటుందనే అంశంతో పాటు న్యాయపరమైన అంశాలను కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Next Story