Mon Feb 02 2026 07:54:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు సీరియస్

గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యేపై ఉన్న మైనింగ్ ఆరోపణలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైనింగ్ కు పాల్పడుతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయకుండా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. యరపతనేని మైనింగ్ వల్ల ప్రభుత్వానికి ఎంతమేరకు నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా ధర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేసింది. సీబీఐ, కాగ్, సెంట్రల్ మైనింగ్ శాఖను ప్రతివాదులుగా చేరుస్తూ యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ వచ్చే నెల 21కి కేసును వాయిదా వేసింది.
Next Story

