Wed Mar 18 2026 10:41:52 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు... వైసీపీకి మరో ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసును వీరన్న దాచిపెట్టారు. వీరన్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేయలేదు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు వీరన్న ఎన్నిక చెల్లదని... ఎన్నికలు జరిగే వరకు వైసీపీ అభ్యర్థి డా.తిప్పేస్వామి కొనసాగాలని ఆదేశించింది.
Next Story

