Mon Mar 23 2026 06:05:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బోండా ఉమకు హైకోర్టు షాక్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులకు హైకోర్టు షాక్ ఇచ్చిది. పోర్జరి, కేసులో బోండా ఉమ సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు విజయవాడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గత ఫిబ్రవరిలో రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి బోండా ఉమపై ఫోర్జరీ, నకిలీ పత్రాలు, బెదింపులకు పాల్పడుతున్నారని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని విజయవాడ పోలీసులను ఆదేశించింది.
Next Story

