Tue Mar 24 2026 00:33:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని హైకోర్టు లో రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు... తాను అడిగిన భద్రత కేంద్ర బలగాలతో కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చింది. భద్రతకు అయ్యే ఖర్చు మాత్రం రేవంత్ రెడ్డి భరించాల్సి ఉంటుందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువరించే వరకు భద్రత ఇవ్వాలని కోర్టు చెప్పింది.
Next Story

