Wed Mar 18 2026 20:50:45 GMT+0530 (India Standard Time)
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుకు నూతన సీజే

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు 93వ ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల డీజీపీలు, సీఎస్‌లు, హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా జడ్జిలు హాజరయ్యారు. 1959 ఏప్రిల్ 29న జన్మించిన రాధాకృష్ణన్, కర్ణాటకలోని కేజీఎఫ్ లా కాలేజ్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో చత్తీస్గడ్ ప్రధాన న్యాయమూర్తి పనిచేశారు.
Next Story

