Mon Dec 08 2025 17:28:27 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ

మిరాశి అర్చకులకు రిటైర్మెంట్ అంశంలో టీటీడీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిరాశి వంశీయులకు రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమలతో పాటు గోవిందరాజస్వామి దేవస్థానం, తిరుచానూరు ఆలయాల్లో రిటైర్మెంట్ నిబంధనను టీటీడీ అమలు చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ మిరాశి వంశీయులు హైకోర్టును ఆశ్రయించగా వారిని కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై మిరాశి వంశీయులు హర్షం వ్యక్తం చేస్తుండగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని టీటీడీ భావిస్తోంది.
Next Story

