Sun Mar 15 2026 18:57:06 GMT+0530 (India Standard Time)
ఆ ఎన్నికల ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విచారణాధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏకగ్రీవాలపై ఫారం 10 ఇచ్చిన [more]
గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విచారణాధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏకగ్రీవాలపై ఫారం 10 ఇచ్చిన [more]

గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విచారణాధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏకగ్రీవాలపై ఫారం 10 ఇచ్చిన స్థానాల్లో మళ్లీ విచారణ చేపట్టకూడదని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు సూచించింది. ఫారం 10 ఇవ్వని చోట ఫలితాలను వెల్లడించవద్దని పేర్కొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎన్నికల కమిషన్ కు లేదంటూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టు విచారించింది. ఈ నెల 23వ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది.
Next Story