రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఇస్తూ హైకోర్టు ఆదేశించింది . ఎంపీ రేవంత్ రెడ్డి [more]
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఇస్తూ హైకోర్టు ఆదేశించింది . ఎంపీ రేవంత్ రెడ్డి [more]

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఇస్తూ హైకోర్టు ఆదేశించింది . ఎంపీ రేవంత్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఎగర వేసాడన్న ఆరోపణల మేరకు నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల క్రితం అరెస్టు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి తన బెయిల్ మంజూరు చేయాలంటూ మొదటిగా కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదప్రతివాదనలు విన్న తర్వాత కూకట్ పల్లి కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తన బెయిల్ తో పాటు అరెస్ట్ అక్రమమంటూ రాష్ట్ర హైకోర్టును రేవంత్ రెడ్డి ఆశించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది . కేటిఆర్ ఫామ్ హౌస్ పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఎగరవేశారన్న ఆరోపణల మేరకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు.

