కోడెల ఫోన్ ఇంకా…?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి [more]
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి [more]

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందని కోర్టు ప్రశ్నించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది. మరో వైపు కోడెలకు సంబంధించిన మొబైల్ ఫోన్ మాత్రం ఇంకా పోలీసుల ఆధీనంలోకి రాలేదు. కోడెల దశదిన కర్మలు పూర్తయిన తర్వాత అందజేస్తామని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కోడెల మొబైల్ నుంచి చివరి ఫోన్ కాల్ సెక్యూరిటీ సిబ్బంది ఆదాబ్ కు ఫోన్ చేసినట్లు తేలింది.