Thu Mar 19 2026 10:39:10 GMT+0530 (India Standard Time)
హీరోయిన్ ఇల్లు మునిగిపోయింది

కేరళ వరదల్లో లక్షల సంఖ్యల్లో ఇళ్లు నీట మునిగాయి. సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఇల్లు నీటమునిగి నిరాశ్రయులైన వారిలో నటీనటులు, సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇప్పటికే మళయాళీ అగ్రనటుడు మోహన్ లాల్ ఇల్లు ఇలానే నీటముననగా ఇప్పుడు హీరోయిన్ అనన్య(జర్నీ సినిమా నటి) ఇంట్లోకి కూడా నీరు చేరింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ చిన్న వీడియోలో చాలా భావోద్వేగంతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు మరో నటి ఆశా శరత్ ఇంట్లో తలదాచుకున్నట్లు ఆమె వెల్లడిచింది.
Next Story

