Tue Mar 24 2026 00:31:27 GMT+0530 (India Standard Time)
శివాజీ ఇరుక్కుంటాడా....?

ఆపరేషన్ గరుడ అంటూ హీరో శివాజీ చెప్పింది కట్టుకథేనా? లేక నిజమా? ఈ విషయంపై నిగ్గులేల్చాలని ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు హీరో శివాజీపై విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డిలు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నమూ ఆపరేషన్ గరుడలో భాగమేనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేయడంతో హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడకు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. అయితే దీనిపై తమకు అనుమానాలున్నాయని, టీడీపీయే ఆపరేషన్ గరుడను రచించి అమలు చేస్తుందేమోనన్న ఆందోళనను వైసీపీ నేతలు వ్యక్తం చేశారు. హీరో శివాజీని అదుపులోకి తీసుకుని విచారించాలని వారు పోలీస్ కమిషనర్ ను కోరారు.
Next Story

