Mon Mar 23 2026 11:51:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హీరాకు బెయిల్

హీరా గ్రూపు అధినేత నౌహీరాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29వ తేదీలోగా కోర్టుకు 5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఐదు లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా హైదరాబాద్ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. హీరా గ్రూపు అధినేత నౌహీరా అక్రమంగా డిపాజెట్లు సేకరించారని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story

