Fri Dec 05 2025 08:23:13 GMT+0000 (Coordinated Universal Time)
మన అంతరిక్ష కేంద్రం.. చూశారా?
భారత్ భూ కక్ష్యలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ పేరుతో సిద్ధమయ్యే ఈ వేదిక

భారత్ భూ కక్ష్యలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ పేరుతో సిద్ధమయ్యే ఈ వేదిక నమూనాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆవిష్కరించింది. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండురోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా దీన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం భూ కక్ష్యలో ఐదు అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనాకు చెందిన తియాంగాంగ్ రోదసి కేంద్రం ఉన్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమికి 400-450 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెడతారు. దశలవారీగా దీని నిర్మాణం సాగుతుంది. 2035 నాటికి పూర్తవుతుంది. 27 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంటుంది. మొత్తం బరువు 52 టన్నులు. ముగ్గురు నుంచి ఆరుగురు వ్యోమగాములు ఇందులో ఉండొచ్చు.
Next Story

