Mon Mar 23 2026 20:07:28 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..?

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అసలు వివిధ పార్టీల వారు జగన్ ను పరామర్శిస్తే చంద్రబాబుకు అంత ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. ప్రతీ విషయానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, టీడీపీ నేతల దాడుల వల్లే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.
Next Story

