Wed Mar 18 2026 05:42:06 GMT+0530 (India Standard Time)
ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో ఎలా చెల్లుతుంది..?

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చెల్లని రూపాయితో సమానమని కాంగ్రెస్ విమర్శించిందని, మరి ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో ఎలా చెల్లుతుందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో హామీ ఇచ్చి కూడా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీతో కలవడం చారిత్రక అవసరం అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ తో కలవడం చారిత్రక అవసరం అంటున్నారని... ఇది చారిత్రక అవసరం కాదు.. చంద్రబాబు అవసరం అని ఎద్దేవా చేశారు. ఏపీలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు 10 శాతం కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం... రెండు నాల్కల ధోరణి అని పేర్కొన్నారు.
Next Story

