Sun Mar 22 2026 04:16:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం ఆయన సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చారు. దీంతో కార్యకర్తలు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీకి అతిసమీపంలో బాణాసంచా కాల్చగా ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. కార్యకర్తలు భయంతో ద్విచక్ర వాహనాలను వదిలి పరుగులు తీశారు. మంటలకు అతి సమీపంలో హరీష్ రావు ఉన్నారు. అయితే, వెంటనే గన్ మెన్లు తేరుకుని హరీష్ రావును పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.
Next Story

