Mon Feb 02 2026 04:57:24 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదాపై బాంబు పేల్చిన హరీష్ రావు

ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళనలు కొనసాగుతుంటే, తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణలోని పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణలో సమస్యలు సృష్టిస్తారా..? అని ప్రశ్నించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసిందన్నారు. హైకోర్టును విభజించకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఏపీకి పన్ను రాయితీలు ఇచ్చినా తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story

