Mon Mar 23 2026 04:47:45 GMT+0530 (India Standard Time)
సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకే

కేసీఆర్ లంచగొండి అని, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకున్నారని ఆరోపించిన మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ... కేవలం ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పుకునేందుకే జైపాల్ రెడ్డి నోటికొచ్చినట్లు అబద్ధాలు ఆడారని పేర్కొన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు అవినీతి మరక అంటించేందుకు ప్రయత్నించి కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా జైపాల్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. గతంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా కాంగ్రెస్ మార్చిందని వారు గుర్తు చేశారు.
Next Story

