Fri Mar 20 2026 00:49:17 GMT+0530 (India Standard Time)
అశ్రునయనాల మధ్య వీడ్కోలు

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ కు అశ్రునయనాల మధ్య తుదివీడ్కోలు పలికారు. మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం వద్ద నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు హరికృష్ణ అంతిమయాత్ర జరిగింది. వేలాదిగా వచ్చిన అభిమానులు, టీడీపీ నేతల మధ్య ఆయన భౌతికకాయాన్ని స్మాశానవాటికకు తరలించారు. అధికార లాంఛనాల నడుమ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Next Story

