Mon Feb 02 2026 13:13:39 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేతలకు ఢిల్లీలో ఎర్త్ పెడుతున్న జీవీఎల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్టీ నేతలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో జరిగిన చర్చ తర్వాత టీడీపీ నేతలు తనను బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఖబడ్దార్ అంటూ టీడీపీ నేతల బెదిరింపులకు సంబంధించిన వీడియో ఆధారాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగట్టినందుకే తనపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య, ఈమని సూర్యనారాయణ సహా ఇతర నేతలపై ఆయన ఈ నోటీసులు ఇచ్చారు.
Next Story

