Sun Mar 22 2026 21:34:55 GMT+0530 (India Standard Time)
లోకేష్ కు సీఎం రమేశ్ బినామీ అని తేలింది

సీఎం రమేశ్ పై ఐటీ దాడులు జరగడంపై మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు చూస్తే రమేశ్ లోకేష్ కి బినామీ అని తేలిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఐటీ శాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ కక్ష సాధింపు అనడం సరికాదన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఐటీ శాఖ దాడులు జరపదని, సీఎం రమేశ్ అక్రమ లావాదేవీలపై సమాచారంతోనే దాడులు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎం రమేశ్ దొంగ దీక్షకు ఎవరూ భయపడరని, అది ఫిట్ నెస్ కోసం చేస్తున్నట్లుగా టీడీపీ ఎంపీలే అపహాస్యం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు అనడం హాస్యాస్పదం అన్నారు. టీడీపీ నేతల అక్రమాలను కేంద్ర సంస్థలు వెలికితీస్తాయని ఆయన పేర్కొన్నారు.
Next Story

