Thu Feb 13 2025 21:34:16 GMT+0000 (Coordinated Universal Time)
బాబుతో స్నేహమా? హ్హ..హ్హ…హ్హ
చంద్రబాబుతో తమ పార్టీ తిరిగి స్నేహం చేయాడమా? అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తాము తప్పు చేశామని చంద్రబాబు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని, [more]
చంద్రబాబుతో తమ పార్టీ తిరిగి స్నేహం చేయాడమా? అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తాము తప్పు చేశామని చంద్రబాబు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని, [more]

చంద్రబాబుతో తమ పార్టీ తిరిగి స్నేహం చేయాడమా? అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తాము తప్పు చేశామని చంద్రబాబు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని, కానీ తాము గతంలో చెప్పినా చంద్రబాబు విన్పించుకోలేదన్నారు. తమకు చంద్రబాబుతో స్నేహం చేసే అవసరం లేదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. తమ పార్టీలోకే తెలుగుదేశం సభ్యులు వస్తున్నారని, తమకు ఆయనతో స్నేహం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ కూడా తాము ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని చెప్పారు. చంద్రబాబుతో కలిసే ప్రసక్తి లేదని తేల్చారు.
Next Story