Wed Mar 18 2026 22:50:12 GMT+0530 (India Standard Time)
బాబుపై జీవీఎల్ జోస్యం

పార్లమెంటు సమావేశాల తర్వాత చంద్రబాబు అవినీతి పనులను మరింత బయటపెడతామని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మిక తప్పిదం చేసిందన్నారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ దాని తోక పార్టీలా మారిందన్నారు. తాను ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పకుండా, తనపై ఎదురుదాడికి తెలుగుదేశం పార్టీనేతలు దిగుతుంటే నవ్వొస్తుందన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు అవినీతిని మరింత ఎండగడతామన్నారు. చంద్రబాబు చేసే అవినీతిని రాష్ట్ర ప్రజలు ఇప్పడిప్పుడే తెలుసుకుంటున్నారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఘోరంగా టీడీపీ పరిస్థితి ఏపీలో ఉంటుందని జీవీఎల్ జోస్యం చెప్పారు.
Next Story

