Thu Mar 19 2026 10:27:03 GMT+0530 (India Standard Time)
గురుమూర్తికి పోటీ చేసే అర్హత లేదు
తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువా? కాదా? చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గురుమూర్తి గూడూరులో చర్చికి వెళ్లి బిషప్ ఆశీర్వాదం [more]
తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువా? కాదా? చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గురుమూర్తి గూడూరులో చర్చికి వెళ్లి బిషప్ ఆశీర్వాదం [more]

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువా? కాదా? చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గురుమూర్తి గూడూరులో చర్చికి వెళ్లి బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారని జీవీఎల్ నరసింహారావు అన్నారు. షెడ్యూల్ కాస్ట్ 1950 ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతం కాకుండా అన్యమత ధర్మాన్ని పాటించే ఎవరైనా ఎస్సీలుగా గుర్తించరని జీవీఎల్ నరసింహారావు అన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని గురుమూర్తి ఎందుకు దర్శించుకోలేదని ప్రశ్నించారు. అసలు తిరుపతి రిజర్వ్ స్థానం నుంచి పోటీ చేసే అర్హత గురుమూర్తికి లేదని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.
Next Story