Sat Mar 21 2026 07:20:25 GMT+0530 (India Standard Time)
ఇది మరో డ్రామా..!

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాకు తెరతీసిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. పోరాటమంటూ రాజకీయ ఆరాటంతో చంద్రబాబు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని పేర్కొన్నారు. అవసరానికి వాడుకోవడానికి చంద్రబాబుకు ఇది ఒక డ్రామా దొరికిందని ఆరోపించారు. చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు ఇంతవరకు బయటకు రావడం లేదని, అనేక కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. పీడీ అకౌంట్ల వ్యవహారంలో విచారణ జరిపిస్తే చంద్రబాబు అవినీతి బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Next Story

