Mon Mar 23 2026 21:41:15 GMT+0530 (India Standard Time)
ఇక జరిగేది ‘ఆపరేషన్ నరుడ’

ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన హత్యాయత్నంతో తమకు సంబంధం లేదన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, అదే టీడీపీ నేతలపై ఈ దాడి జరిగితే వారు ఊరుకునే వారా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. శనివారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ మంత్రి సోమిరెడ్డి సిగ్గు లేకుండా, దిగజారి మాట్లాడుతున్నారని, వారైతే అంత చిన్న కత్తితో దాడిచేయరని చెప్పడం దారుణమన్నారు. అంటే వారిది మాఫియా అనే చెబుతున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రానుంది ‘ఆపరేషన్ నరుడ’ అని... ప్రజలు టీడీపీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించడమే ఈ ఆపరేషన్ అని పేర్కొన్నారు.
Next Story

