Tue Mar 24 2026 16:20:47 GMT+0530 (India Standard Time)
జగన్ తో ఎలాంటి సంబంధాలున్నా రాజీ ప్రసక్తి లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి సంబంధాలున్నప్పటికీ నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీ పడరని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి సంబంధాలున్నప్పటికీ నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీ పడరని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి సంబంధాలున్నప్పటికీ నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీ పడరని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి జగన్ 80 వేల క్యూసెక్కులు తీసుకెళ్లాలనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడాన్ని తెలంగాణలో ఎవరూ అంగీకరించబోరన్నారు. ఈ విషయంపై రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలూ ఏకం కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. విపక్షాల రెండు గంటల దీక్ష చేసి ఉద్యమాలను అవమానపరుస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమేనన్నది అందరికీ తెలుసునన్నారు.
Next Story