Sat Mar 07 2026 23:17:32 GMT+0530 (India Standard Time)
నేను వార్నింగ్ ఇవ్వలేదు
మంత్రి జయరాం మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఎస్సైని బెదిరిస్తూ ఆయన చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారని మంత్రి [more]
మంత్రి జయరాం మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఎస్సైని బెదిరిస్తూ ఆయన చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారని మంత్రి [more]

మంత్రి జయరాం మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఎస్సైని బెదిరిస్తూ ఆయన చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారని మంత్రి జయరాం ఎస్సై కి వార్నింగ్ ఇచ్చారు. పట్టుకున్న ట్రాక్టర్లను వెంటనే వదిలేయాని ఆయన హెచ్చరించారు. లేకుంటే తాను ధర్నాకు దిగుతానని జయరాం వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అయితే ఈ వివాదంపై గుమ్మనూరి జయరాం స్పందించారు. తనను బాధితులు కలసి ఎస్సై అకారణంగా తమ ట్రాక్టర్లను పట్టుకున్నారని చెబితే ఎస్సైతో మాట్లాడానని వార్నింగ్ ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
Next Story