Thu Mar 19 2026 06:41:04 GMT+0530 (India Standard Time)
రాజుగారి విషయంలోనూ ఒక్కటయ్యారా?
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం కరెక్టేనని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాజు గారి విషయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు మళ్లీ ఒక్కటయ్యారన్నారు. [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం కరెక్టేనని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాజు గారి విషయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు మళ్లీ ఒక్కటయ్యారన్నారు. [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం కరెక్టేనని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాజు గారి విషయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు మళ్లీ ఒక్కటయ్యారన్నారు. తొలి నుంచి చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కల్యాణ్, రఘురామ కృష్ణంరాజులు పనిచేస్తున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. క్షత్రియ సామాజికవర్గానికి ఆయన చెడ్డపేరు తెచ్చారన్నారు. కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని రఘురామ కృష్ణంరాజు పనిగా పెట్టుకున్నారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేయడం ఇప్పటికే ఆలస్యమయిందని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.
Next Story