Thu Feb 13 2025 10:31:44 GMT+0000 (Coordinated Universal Time)
వై.ఎస్.జగన్ కు ఘనస్వాగతం
రేపు ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్లారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్న ఆయనకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు, పార్టీ [more]
రేపు ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్లారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్న ఆయనకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు, పార్టీ [more]

రేపు ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్లారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్న ఆయనకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయన తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయంలో ఇవాళ పార్టీ కీలక నేతలతో రేపటి కౌంటింగ్ కు సంబంధించి చర్చలు జరపనున్నారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడి పార్టీ శ్రేణులకు సూచించనున్నారు. రేపు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు.
Next Story