Wed Mar 18 2026 12:12:40 GMT+0530 (India Standard Time)
ఏపీ సెక్రటేరియట్ కు గ్రామ పంచాయితీ నోటీసులు..?

ఎన్నిసార్లు అడిగినా పన్నులు కట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెలగపూడి గ్రామ పంచాయితీ నోటీసులు పంపింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెలగపూడి గ్రామం పరిధిలో ఉంది. అయితే, సుమారు 6 లక్షల చదరపు విస్తీర్ణంలో ఉన్న సచివాలయం గత రెండు సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. భవనం విస్తీర్ణం వివరాలు ఇవ్వాలని, దానిని బట్టి పన్ను వసూలు చేస్తామని గ్రామ పంచాయితీ అధికారులు కోరినా స్పందించలేదు. దీంతో గ్రామ పంచాయితీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. ఏకంగా రాష్ట్ర సచివాలయానికే ఒక గ్రామ పంచాయితీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారింది.
Next Story

