Sun Mar 22 2026 06:26:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ ఎంట్రీతో…?
కర్ణాటక రాజకీయ సంక్షోభంలోకి గవర్నర్ వాజూబాయి వాలా ఎంటర్ అయిపోయారు. స్పీకర్ రమేష్ కుమార్ ను నేడు విశ్వాస పరీక్ష ను నిర్వహించాలని కోరారు. భారతీయ జనతా [more]
కర్ణాటక రాజకీయ సంక్షోభంలోకి గవర్నర్ వాజూబాయి వాలా ఎంటర్ అయిపోయారు. స్పీకర్ రమేష్ కుమార్ ను నేడు విశ్వాస పరీక్ష ను నిర్వహించాలని కోరారు. భారతీయ జనతా [more]

కర్ణాటక రాజకీయ సంక్షోభంలోకి గవర్నర్ వాజూబాయి వాలా ఎంటర్ అయిపోయారు. స్పీకర్ రమేష్ కుమార్ ను నేడు విశ్వాస పరీక్ష ను నిర్వహించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ నేతలు యడ్యూరప్ప ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశారు. స్పీకర్ కావాలనే విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన వాజుబాయి వాలా స్పీకర్ రమేష్ కుమార్ కు ఈరోజు విశ్వాస పరీక్షను నిర్వహించాలని లేఖ రాయడం చర్చనీయాంశమయింది. గవర్నర్ శాసనసభ వ్యవహారాలను పరిశీలించడానికి శాసనసభకు ప్రత్యేకంగా ఒక అధికారిని పంపడం విశేషం.
Next Story