Tue Mar 24 2026 08:56:03 GMT+0530 (India Standard Time)
గవర్నర్ పై టీడీపీ నిప్పులు

గవర్నర్ పై టీడీపీ బాణాలు ఎక్కుపెట్టింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుట్రపన్ని బీజేపీ, టీడీపీ మధ్య చిచ్చు పెట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజ్ భవన్ వేదికగా ఈ కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. జగన్, పవన్ కల్యాణ్ లను బీజేపీకి దగ్గరగా చేర్చింది నరసింహన్ అని ఆయన ఆరోపించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై గవర్నర్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆయన అనడం సంచలనం కల్గిస్తోంది.
Next Story

