Tue Mar 17 2026 20:24:15 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ప్రభుత్వానికి తమిళిసై లేఖ.. ఆ హత్యలపై…?
ప్రముఖ న్యాయవాది వామనరావు దంపతుల హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈమేరకు ఆమె తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వామనరావు హత్య విషయంలో విచారణను వేగవంతం చేయాలని [more]
ప్రముఖ న్యాయవాది వామనరావు దంపతుల హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈమేరకు ఆమె తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వామనరావు హత్య విషయంలో విచారణను వేగవంతం చేయాలని [more]

ప్రముఖ న్యాయవాది వామనరావు దంపతుల హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈమేరకు ఆమె తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వామనరావు హత్య విషయంలో విచారణను వేగవంతం చేయాలని తమిళిసై లేఖలో కోరారు. ఈకేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. వామనరావు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలని తమిళిసై కోరారు. తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. అక్కడి నుంచే ఆమె తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఆఫీస్ ద్వారా తెలంగాణకు సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు తమిళిసై తెలిపారు.
Next Story