ఆ ఐపీఎస్ పై జగన్ సర్కార్ సీరియస్
ఏపీఎస్సీ ఏడీజీ మాదిరెడ్డి ప్రతాప్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇటీవలే మాదిరెడ్డి ప్రతాప్ ను ఆర్టీసీ ఎండీ నుంచి [more]
ఏపీఎస్సీ ఏడీజీ మాదిరెడ్డి ప్రతాప్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇటీవలే మాదిరెడ్డి ప్రతాప్ ను ఆర్టీసీ ఎండీ నుంచి [more]

ఏపీఎస్సీ ఏడీజీ మాదిరెడ్డి ప్రతాప్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇటీవలే మాదిరెడ్డి ప్రతాప్ ను ఆర్టీసీ ఎండీ నుంచి ఏపీఎస్పీ ఏడీజీగా బదిలీ చేసింది. తనను ఆర్టీసీ ఎండీ పదవి నుంచి తప్పించడంతో మాదిరెడ్డి ప్రతాప్ హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ నిర్వహించి, రకరకాల వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ చేయడంపై ప్రెస్ మీట్ నిర్వహించడం, బదిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారంలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ మాదిరెడ్డి ప్రతాప్ ను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆలిండియా సర్వీస్ నియమాలను ఉల్లంఘించారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.