Sat Mar 07 2026 14:20:54 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ కు గవర్నర్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ నరసింహన్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీన [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ నరసింహన్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీన [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ నరసింహన్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ప్రమాణస్వీకారానికి సమయం నిర్ణయించారు. అంతకుముందు జగన్ ను వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు గవర్నర్ కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. తర్వాత జగన్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Next Story