Mon Mar 16 2026 00:24:29 GMT+0530 (India Standard Time)
ముఖేష్ అంబానీపై విరుచుకుపడ్డ గవర్నర్

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీపై జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఫైరయ్యారు. ఆయన జమ్మూలో జరిగిన ఫ్లాగ్ డేలో మాట్లాడుతూ పేరు చెప్పకుండా అంబానీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తి కుమార్తె పెళ్లికి రూ.700 కోట్లు ఖర్చు చేశారని, అతనికి ఆ డబ్బులు సేవ చేయడానికి, దేశం కోసం వెచ్చించడానికి చేతులు రాలేదన్నారు. ఆ డబ్బులో జమ్మూ కశ్మీర్ లో 700 పాఠశాలలు నిర్మించవచ్చని, 7000 మంది సైనిక అమరవీరుల పిల్లలు చదివించవచ్చని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారులు కేవలం సంపద పైనే ఆలోచిస్తున్నారు కానీ సేవ చేయడాలని ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు.
Next Story

