Sun Mar 15 2026 01:07:50 GMT+0530 (India Standard Time)
వెనక్కు తగ్గనంటున్న గోరంట్ల
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారు. తాను చంద్రబాబును కూడా కలిసే ప్రసక్తి లేదని ఆయన చెబుతున్నారు. [more]
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారు. తాను చంద్రబాబును కూడా కలిసే ప్రసక్తి లేదని ఆయన చెబుతున్నారు. [more]

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారు. తాను చంద్రబాబును కూడా కలిసే ప్రసక్తి లేదని ఆయన చెబుతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తారన్న ప్రచారంతో అనేక మంది నేతలు ఆయన వద్దకు వచ్చారు. నిమ్మకాయల చినరాజప్పతో సహా స్థానిక నేతలు బుచ్చయ్యను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే తాను మాత్రం రాజీనామా నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని, త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని బుచ్చయ్య చౌదరి చెబుతుండటంతో పార్టీ నేతలకు ఏమి చేయాలోపాలు పోవడం లేదు.
Next Story