Tue Mar 17 2026 00:47:32 GMT+0530 (India Standard Time)
జగన్ కు చేతకావడం లేదు
కరోనా కట్టడి చేయడం జగన్ ప్రభుత్వానికి చేత కావడం లేదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తొలి నుంచి జగన్ కరోనాను నిర్లక్ష్యం [more]
కరోనా కట్టడి చేయడం జగన్ ప్రభుత్వానికి చేత కావడం లేదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తొలి నుంచి జగన్ కరోనాను నిర్లక్ష్యం [more]

కరోనా కట్టడి చేయడం జగన్ ప్రభుత్వానికి చేత కావడం లేదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తొలి నుంచి జగన్ కరోనాను నిర్లక్ష్యం చేశారన్నారు. ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయిన తర్వాతనే జగన్ మేలుకున్నారన్నారు. ఇప్పటికైనా కరోనా సీరియస్ ను జగన్ గుర్తిస్తారనుకుంటే అదీ జరగడం లేదన్నారు. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. కనీసం వైద్యులకు కనీస సదుపాయాలను కూడా కల్పించడం లేదన్నారు. జగన్ కరోనా కట్టడి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
Next Story