Sat Mar 21 2026 10:54:31 GMT+0530 (India Standard Time)
నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు 20 వేల ఖాళీలను భర్తీ చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా నియామక ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. గ్రూప్ - 1, 2, 3, డీఎస్సీ, పోలీస్ శాఖల్లో మొత్తం 20,010 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మంగళవారం ఉదయం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు నిర్ణయించారు. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.
Next Story

