Mon Feb 02 2026 09:20:45 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు కేంద్రం శుభవార్త

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యాద్రాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. బీబీనగర్ లో 49 ఎకరాల స్థలంతో పాటు రోడ్లు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్రానికి సూచించింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీబీనగర్ లో నిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేసి భారీ ఎత్తున నిర్మించారు. కానీ, ఏళ్లు గడిచినా అందులో ఆసుపత్రిని మాత్రం ప్రారంభించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిమ్స్ కోసం నిర్మించిన భవనంలో ఎయిమ్స్ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ విజ్ఞప్తిని కేంద్రం ఇప్పుడు అంగీకరించింది.
Next Story

