Sun Feb 01 2026 14:13:55 GMT+0000 (Coordinated Universal Time)
గోదారిలో పడవ బోల్తా

గోదావరి నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. దాదాపు పది మంది ప్రయాణికులు గల్లంతయినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలోని తలారి వారి పాలెం నుంచి పశువుల్లంకకు నాటు పడవలో దాదాపు ఇరవై మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఒక పిల్లర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో పడవలోని ప్రయాణికులు గల్లంతయ్యారు. మునిగిపోతున్న కొందరిని స్థానికులు రక్షించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడవ ప్రయాణంపై ఆరా తీశారు. మునిగిపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
Next Story
