విశాఖను కాదనలేదే?
విశాఖపట్నంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చని తాము సూచించామని జీఎన్ రావు తెలిపారు. విశాఖలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పిన మాట వాస్తవమే కాని, సచివాలయాన్ని విశాఖకు [more]
విశాఖపట్నంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చని తాము సూచించామని జీఎన్ రావు తెలిపారు. విశాఖలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పిన మాట వాస్తవమే కాని, సచివాలయాన్ని విశాఖకు [more]

విశాఖపట్నంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చని తాము సూచించామని జీఎన్ రావు తెలిపారు. విశాఖలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పిన మాట వాస్తవమే కాని, సచివాలయాన్ని విశాఖకు ఉత్తర ప్రాంతంగా ఉన్న చోట ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. విజయనగరం, విశాఖ మధ్యలో సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో కాకుండా దూరంగా పెట్టుకోవాలని తాము సూచించామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ల్లో వాతావరణ పరిస్థితులను వివరించడంలో భాగంగా విశాఖకు తుపాను ముప్పు ఉంందని చెప్పామన్నారు. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసుకుంటే తప్పేమీ లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు.