Thu Mar 26 2026 21:18:29 GMT+0530 (India Standard Time)
జగన్ ఇంటికి చేరుకున్న జీఎన్ రావు కమిటీ
రాజధాని ప్రాంతంపై అధ్యయనం చేయడానికి నియమించిన జీఎన్ రావు కమిటీ తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి చేరుకుంది. రాజధాని అమరావతిలో ఏ ఏ సంస్థలు [more]
రాజధాని ప్రాంతంపై అధ్యయనం చేయడానికి నియమించిన జీఎన్ రావు కమిటీ తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి చేరుకుంది. రాజధాని అమరావతిలో ఏ ఏ సంస్థలు [more]

రాజధాని ప్రాంతంపై అధ్యయనం చేయడానికి నియమించిన జీఎన్ రావు కమిటీ తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి చేరుకుంది. రాజధాని అమరావతిలో ఏ ఏ సంస్థలు ఉంచాలి? మిగిలిన ప్రాంతాల్లో వేటిని ఏర్పాటు చేయాలి? అన్న దానిపై జీఎన్ రావు కమిటీ అధ్యయనం చేసింది. పదమూడు జిల్లాల్లో పర్యటించి ప్రజాసంఘాలు, మేధావులు. నిపుణులు, సామాన్య ప్రజలతో చర్చించింది. అయితే ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు మధ్యంతర నివేదికను సమర్పించింది. తాజాగా పూర్తిస్థాయి నివేదికను ఇవ్వనుంది. రాష్ట్ర సమాగ్రభావృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదికలో స్పష్టం చేయనుంది.
Next Story