గ్లోబల్ ఫ్యాక్ట్-చెక్ బాట్ (GFC)లో సభ్యత్వం పొందిన తెలుగుపోస్ట్
తప్పుడు సమాచారంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తున్న పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ లో తెలుగు పోస్ట్ సంస్థ ఒకటి. ఇప్పుడు తెలుగు పోస్ట్ కు అరుదైన స్థానం దక్కింది.

తప్పుడు సమాచారంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తున్న పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ లో తెలుగు పోస్ట్ సంస్థ ఒకటి. ఇప్పుడు తెలుగు పోస్ట్ కు అరుదైన స్థానం దక్కింది. గ్లోబల్ ఫ్యాక్ట్-చెక్ బాట్ వ్యవస్థాపక సభ్యులలో తెలుగు పోస్ట్ కు స్థానం దక్కింది. గ్లోబల్ ఫ్యాక్ట్ చెక్ బాట్ అనేది తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న విశ్వసనీయ వాస్తవ తనిఖీ సంస్థలను ఒకచోట చేర్చే AI-ఆధారిత చొరవ.
గ్లోబల్ ఫ్యాక్ట్ చెక్ బాట్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
గ్లోబల్ ఫ్యాక్ట్ చెక్ బాట్ ప్రాజెక్ట్ ద్వారా ఫ్యాక్ట్-చెకర్స్, ప్రజలు ఇద్దరినీ అనుసంధానించడానికి రూపొందించిన ఒక మార్గదర్శక AI ప్లాట్‌ఫామ్. ఫ్యాక్ట్-చెకింగ్ సంస్థల ద్వారా సృష్టించిన ఈ టూల్ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో ఉన్న వేలాది ఫ్యాక్ట్-చెక్‌లను పంచుకోనుంది. డేటాబేస్‌లోని సమాచారాన్ని ప్రజలకు అందించగలదు. ఏది నిజం, ఏది అబద్ధం అనే సమాచారాన్ని ప్రజలకు వెంటనే అందించగలదు.
మొదట, GFC పది భాషలలో మద్దతు అందిస్తుంది. 50 కంటే ఎక్కువ భాషలకు విస్తరించాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. విభిన్న భాషలలో ఫ్యాక్ట్ చెక్ లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ అధికారికంగా పలు దేశాలలో పనిచేస్తున్న 38 సభ్య సంస్థలు ఇందులో ఇప్పటికే భాగస్వాములు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్ట్ చెక్ సంస్థలను ఒక చోట చేర్చి, ప్రజలకు కావాల్సిన సరైన సమాచారాన్ని అందించనుంది ఈ ప్రాజెక్ట్.
ఎన్నికలు, హెల్త్ ఎమర్జెన్సీలు, వివిధ ప్రాంతాల్లో యుద్దాలు, సంఘర్షణలు లేదా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెరగడం వంటి పరిస్థితుల్లో విశ్వసనీయ సమాచారం అత్యంత వేగంగా అందించగలదు. పనితీరు అత్యంత ప్రభావవంతంగా ఉండాలని GFC లక్ష్యంగా పెట్టుకుంది.
“planner-evaluator” అనే అడ్వాన్స్డ్ ఏఐ ఆర్కిటెక్చర్ ను GFC ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారుల ప్రశ్నలను తీసుకుని అందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ధృవీకరించిన డేటాబేస్‌ను వెతుకుతుంది, సాక్ష్యాలను క్రాస్-చెక్ చేస్తుంది . ఖచ్చితత్వం, సందర్భోచిత అవగాహన (భౌగోళిక/సమయం), విశ్వసనీయతతో కూడిన సమాధానాన్ని అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ స్పామ్, దుర్వినియోగ పరిచే, హానికరమైన లింకుల నుండి రక్షణను అందించ నుంది. ముఖ్యంగా ఏకకాలంలో వేలకొద్దీ అభ్యర్థనలకు సమాధానాలు ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది. GFCని స్వతంత్ర చాట్‌బాట్‌గా ఉపయోగించవచ్చు లేదా సరళమైన కోడ్ లైన్ ద్వారా ఏదైనా వెబ్సైట్లో విలీనం చేయవచ్చు.
తెలుగుపోస్ట్ అధికారికంగా GFC వ్యవస్థాపక సభ్యులలో ఒకటిగా గుర్తింపు పొందింది. GFC గవర్నెన్స్ బృందానికి సాయం అందించింది. ప్లాట్‌ఫామ్ నిర్మాణం, విధానాలు, వ్యూహాత్మక దిశను రూపొందించడంలో ప్రత్యక్ష పాత్ర పోషించింది.
GFC ద్వారా, తెలుగుపోస్ట్ నిజ నిర్ధారణ చేసిన కీలక సమాచారానికి, సంబంధిత వివరాలకు ప్రాంతీయ భాషా నైపుణ్యాన్ని అందిస్తుంది, భారతీయ, ముఖ్యంగా తెలుగు భాషను ప్రపంచ వేదిక పైకి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఫ్యాక్ట్ చెక్ లు, అధునాతన AI సాధనాలతో కూడిన డేటాబేస్ తో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడం వల్ల తెలుగుపోస్ట్ ప్రజలకు వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన ఫ్యాక్ట్ చెక్ లను అందించడానికి మెరుగ్గా పనిచేయనుంది. GFCలో పాల్గొనడం అనేది తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో చేస్తున్న పోరాటంలో తెలుగుపోస్ట్ అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది.
“GFCలో మా భాగస్వామ్యం అయిన మొదటి రోజు నుండే నిజాన్ని నిర్భయంగా చెప్పడంలోనూ, అందుకు సంబంధించిన సహకారం అందించడం లోనూ, సాంకేతిక ఆవిష్కరణల పట్ల తెలుగుపోస్ట్ నిబద్ధతను తెలుపుతోంది” అని తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ ఎడిటర్ సత్య ప్రియ అన్నారు. “ఈ భాగస్వామ్యం ద్వారా, తెలుగు మాట్లాడే వారితో పాటు ఇతర భాషలు మాట్లాడే వారికి విశ్వసనీయమైన, ధృవీకరించిన సమాచారాన్ని అందించి, నిజాలు తెలియజేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.” అని అన్నారు. ఈ సహకారంతో, తెలుగుపోస్ట్ పరిధి మరింత పెరగనుంది. నిజాలు తెలుసుకోవాలనుకునే వారికి మరింత సహాయపడుతుంది. ముఖ్యంగా తప్పుడు సమాచారం అంతకంతకూ పెరిగిపోతున్న క్లిష్టమైన క్షణాలలో తెలుగుపోస్ట్ ప్రజలకు అండగా నిలవనుంది.
GFC కి సంబంధించిన మరింత సమాచారం కోసం: https://globalfactcheck.bot/

