Wed Mar 18 2026 23:52:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఫెర్నాండజ్ కన్నుమూత
మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. 1930 జూన్ లో జన్మించిన జార్జి ఫెర్మాండజ్ వాజ్ పేయి [more]
మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. 1930 జూన్ లో జన్మించిన జార్జి ఫెర్మాండజ్ వాజ్ పేయి [more]

మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. 1930 జూన్ లో జన్మించిన జార్జి ఫెర్మాండజ్ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు, పరిశ్రమలు, రైల్వే, రక్షణ శాఖమంత్రిగా పనిచేశారు. 88 ఏళ్ల వయస్సున్న జార్జి ఫెర్నాండజ్ గతకొంతకాలగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు స్వైన్ ఫ్లూ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జనతాదళ్ పార్టీలో ఉన్న ఆయన తర్వాత సమతా పార్టీని స్థాపించారు. తొమ్మిదిసార్లు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Next Story