Tue Mar 24 2026 18:17:48 GMT+0530 (India Standard Time)
గంటా ఫైరయింది అందుకేనా...?

తనపై బురద జల్లే వారిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ భూకుంభకోణంలో తన పేరు ఉందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని ఆస్తులను అమ్ముకున్నానో తనకే తెలుసునన్నారు. విశాఖ భూ కుంభకోణంపై విచారణ కోరిన వెంటనే సిట్ ను వేసినందుకు ఆయన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎప్పుడైనా చర్చకు......
తనపై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా చర్చకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇటీవల విశాఖ భూకుంభకోణంపై సిట్ ఇచ్చిన నివేదికలో గంటా పేరు లేకపోవడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం కావాలనే గంటాకు క్లీన్ చిట్ ఇచ్చిందని మండిపడుతున్నాయి. అందుకే గంటా ఇలా స్పందించారు.
Next Story

