Thu Mar 19 2026 21:26:58 GMT+0530 (India Standard Time)
గంటా వచ్చేస్తున్నారు...!

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు అలకవీడారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు భీమిలీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత మూడు రోజులుగా అధిష్టానంపై ఆగ్రహించిన గంటా శ్రీనివాసరావు ఇంటికే పరిమితమయ్యారు. సీఎం పర్యటన ఉండటంతో విశాఖ జిల్లా ఇన్ చార్జి మంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఈరోజు ఉదయమే గంటా ఇంటికి చేరుకుని ఆయనను బుజ్జగించారు. తనను ఒకవర్గం టార్గెట్ చేస్తుందంటూ గంటా ఈ సందర్భంగా ఆరోపించినట్లు తెలుస్తోంది. సీఎం అన్ని సమస్యలను పరిష్కరిస్తారని, ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనాలని చినరాజప్ప చేసిన విజ్ఞప్తికి గంటా ఓకే చెప్పారు. చినరాజప్పతో కలసి ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకునేందుకు గంటా శ్రీనివాసరావు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
- Tags
- andhra pradesh
- ap politics
- china rajappa
- ganta srinivasarao
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- గంటా శ్రీనివాసరావు
- చినరాజప్ప
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

