Thu Dec 18 2025 07:30:47 GMT+0000 (Coordinated Universal Time)
భువనేశ్వరికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నా
చంద్రబాబు భార్య భువనేశ్వరికి తాను క్షమాపణలు చెబుతున్నానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు

చంద్రబాబు భార్య భువనేశ్వరికి తాను క్షమాపణలు చెబుతున్నానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తాను అనకూడని మాట అన్నానని ఆయన అంగీకరించారు. తాను ఆ మాటలు అనకుండా ఉండాల్సిందని చెప్పారు. తనపైనా, తన కుటుంబసభ్యులపైన నారా లోకేష్ తన సోషల్ మీడియా స్టాఫ్ తో ట్రోల్ చేయించారని, లోకేష్ ఇంటి అడ్రస్ నుంచి ఇవి వస్తున్నాయని తనకు తెలిసి ఆ మాట అనాల్సి వచ్చిందన్నారు.
ఎన్ని సార్లు చెప్పినా....
తాను అనేక సార్లు లోకేష్ కు చెప్పినా తన భార్య, చెల్లెలు, తల్లిపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయన్నారు. ఇది తట్టుకోలేక ఎమోషనల్ గా ఒక మాట అన్నానని, ఎవరైనా ఆ మాట అనకూడదని వల్లభనేని వంశీ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు వల్లభనేని వంశీ చెప్పారు. భువనేశ్వరిని తాను అక్క అని పిలిచేవాడినని ఆయన అన్నారు.
Next Story

